తడిసిన ధాన్యంతో అన్నదాతల కళ్ళల్లో నీళ్లు

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో తుఫాను కారణంగా కురిసిన వర్షంతో కల్లాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. పంట చేతికి వచ్చే దశలో వర్షం వల్ల పూర్తిగా నష్టం జరిగినట్లు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వపరంగా అన్నదాతలను ఆదుకోవాలని కోరుతున్నారు.