మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవు: ఎస్సై
MLG: మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు అని ఏటూర్ నాగారం మండల ఎస్సై మహేష్ హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. చిన్నపిల్లలకు వాహనాలు ఇస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. కాబట్టి తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 18 సం. లోపు వారికి వాహనాలు ఇవ్వొద్దని సూచించారు.