కొండమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
VZM: గంట్యాడ మండలంలోని మదనాపురంలో గల కొండమ్మ తల్లి పేరంటాలను గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య సోమవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.