నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి: ఎమ్మెల్యే
E.G: రాజానగరం నియోజకవర్గంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. గురువారం రాజానగరం ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన విద్యుత్ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 'మెంథా' తుపాను సమయంలో అధికారులు, సిబ్బంది చురుగ్గా పనిచేశారని అలాగే మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం అధికారులు సహకరించాలని కోరారు.