ఉదయ్ ఎక్స్‌ప్రెస్ 3 రోజుల పాటు రద్దు

ఎన్టీఆర్: ట్రాక్ మరమ్మతుల కారణంగా విజయవాడ మీదుగా గుంటూరు-విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లను 3 రోజుల పాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.22875, నం.22876 ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లను ఆగస్టు 26, 28, 30వ తేదీలలో రద్దు చేస్తున్నామని దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేసింది.