BRS నేతలు ఓర్వలేకపోతున్నారు: మంత్రి సీతక్క

TG: BRS నేతలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంశాన్ని రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. ఆలయంలోకి కాళ్లు కడుక్కుని వెళ్లడం సంప్రదాయం అని.. అందుకే ఈవెంట్ మేనేజ్ మెంట్ యువతి నీళ్లు పోసిందన్నారు. హెరిటేజ్ వాక్ సక్సెస్ అయ్యిందని ఓర్వలేక.. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.