డ్రైనేజీ వ్యవస్థ లోపంతో గ్రామస్తులు ఇబ్బందులు

డ్రైనేజీ వ్యవస్థ లోపంతో గ్రామస్తులు ఇబ్బందులు

NGKL: తాడూర్ మండలం ఐతోల్, గోవిందాయపల్లి, ఏటిదర్పల్లి, అంతారం, తదితర గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడినప్పుడల్లా వర్షపు నీరు, మురుగు నీరు వీధుల్లోకి చేరి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మురుగు నీటి వల్ల దుర్వాసన, దోమల బెడదతో అనారోగ్యాలు ప్రబలుతున్నాయని గ్రామ ప్రజలు వాపోతున్నారు.