చెరుకు క్రషింగ్ పురోగతిపై జేసీ సమీక్ష

చెరుకు క్రషింగ్ పురోగతిపై జేసీ సమీక్ష

VZM: జిల్లాలో చెరుకు క్రషింగ్ కార్యకలాపాల పురోగతిని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ సోమవారం సమీక్షించారు. చెరుకు రవాణా, క్రషింగ్, రైతులకు చెల్లింపులు, మిల్లుల పనితీరుపై అధికారులు వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరకు సాగు విస్తరణకు అధికారులు కృషి చేయాలన్నారు.