పేలుడులో అమ్మోనియం కంటే శక్తివంతమైన పదార్ధం!
ఢిల్లీ పేలుడు ఘటన కోసం అమ్మోనియంతో పాటు దాని కన్నా శక్తివంతమైన మరో పదార్ధాన్ని వాడినట్లు అధికారులు గుర్తించారు. పేలుడు ఘటన నుంచి 40కిపైగా నమూనాలను అధికారులు సేకరించి పరీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక దానిలో అమ్మోనియంను గుర్తించగా.. మరో దానిలో దీని కన్నా శక్తివంతమైన దాన్ని కనుగొన్నారు. అయితే అది ఏ పదార్ధం అనే దానిపై పరిశోధనలు చేస్తున్నారు.