నేడు అఖిలపక్ష సమావేశం

ఢిల్లీలో ఈరోజు ఉదయం 11 గంటలకు కీలకమైన అఖిలపక్ష సమావేశం జరగనుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఇటీవల భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై జరిపిన మెరుపు దాడుల గురించి అన్ని రాజకీయ పార్టీలకు రాజ్‌నాథ్ వివరించనున్నారు. అలాగే, ప్రభుత్వం తీసుకున్న రక్షణ చర్యలు గురించి తెలపనున్నారు.