రేపు మేడికొండలో క్రికెట్ టోర్నమెంట్

GDWL: అయిజ మండలం మేడికొండ గ్రామంలో బ్రహ్మయ్య జాతర సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం టోర్నమెంట్ ఉంటుందని, ఆసక్తి గల యువకులందరూ మేడికొండ చెరువు సమీపంలోని గ్రౌండ్ వద్దకు రావాలని పిలుపునిచ్చారు. పాల్గొనాలనుకునే జట్లు తమ వెంట క్రికెట్ కిట్లను తెచ్చుకోవాలని సూచించారు. గెలిచిన టీంకు బహుమతులు అందజేస్తామన్నారు.