VIRAL: ఏనుగు నుంచి తృటిలో తప్పించుకున్న వ్యక్తి

VIRAL: ఏనుగు నుంచి తృటిలో తప్పించుకున్న వ్యక్తి

కెనడియన్ ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ నోలన్ సౌమురే ఓ ఏనుగు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని అటవీ ప్రాంతంలో అతను స్కూటీపై వెళ్తుండగా రోడ్డుపైకి అనుకోకుండా ఏనుగు వచ్చింది. దానిని చూసి నోలన్ స్కూటీని ఆపాడు. అయితే ఏనుగు నోలన్ పైకి పరుగెత్తుకు రావడంతో చాకచక్యంగా తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.