VIDEO: బాపట్ల - అప్పికట్ల మధ్య ప్రమాదం
BPT: బాపట్ల-అప్పికట్ల మార్గంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి నేరుగా పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో భార్యాభర్తలతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో వారికి గాయాలయ్యాయి. దీంతో స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.