గోదావరి సర్క్యూట్‌తో ప్రాంతీయ అభివృద్ధి చేస్తాం: మంత్రి
MGL: బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. పర్యాటకం, ఆధ్యాత్మిక క్షేత్రాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మంగపేట మండలంలో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో 6 జోన్లుగా ప్రజాదర్బార్లు నిర్వహించి 20 ఏళ్ల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు.