VIDEO: ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు
KRNL: భారత తొలి ప్రధానమంత్రి, పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఎమ్మిగనూరులోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఖాసీంవలి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు పంచుతూ, బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.