ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

WNP: ఖిల్లా ఘనపూర్ మండలంలో పర్యటించిన వనపర్తి ఎమ్మెల్యే మేగా రెడ్డి జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల తరగతి గదులు కలియ తిరిగారు. సుమారు గంటన్నర సేపు విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు, అదనపు గదులు, ఉపాధ్యాయుల కొరతపై దృష్టి పెడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.