పనిచేయని BSNL సెల్ టవర్లు

KDP: తొండూరు మండల వ్యాప్తంగా ఉన్న BSNL సెల్ టవర్లు పనిచేయక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. 20 రోజుల నుంచి మండలంలోని BSNL టవర్ల పరిధిలో ఉన్న వినియోగదారులకు ఫోన్లు చేస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నాయన్నారు. ఆగడూరు, సంతకొవ్వూరు గ్రామాల పరిధిలోని సెల్ టవర్ల పరిధిలో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు.