పెనుగొండ పేరుమార్పు ఆర్యవైశ్యుల గౌరవానికి నిదర్శనం

పెనుగొండ పేరుమార్పు ఆర్యవైశ్యుల గౌరవానికి నిదర్శనం

KRNL: సీఎం చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యుల అభిమానం, గౌరవాన్ని ప్రతిబింబించే నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండను ‘వాసవీ పెనుగొండ’గా మార్చిన సీఎం నిర్ణయానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైశ్యుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ సీఎం చంద్రబాబుకు అండగా ఉంటారని మంత్రి పేర్కొన్నారు.