గ్రేటర్‌లో పెరుగుతున్న టైఫాయిడ్ కేసులు
HYD: గ్రేటర్‌లో టైఫాయిడ్, ఊపిరితిత్తుల కేసులు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. గాంధీ, ఉస్మానియా, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రుల్లో గత 15 రోజుల్లోనే ఏకంగా 18 మందికి పైగా టైఫాయిడ్, డయేరియా ఇతర రోగాలతో బారిన పడినట్లు అధికారులు తెలిపారు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, అలసట, కడుపునొప్పి, దద్దుర్లు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని సూచించారు.