యూరియా కోసం క్యూలో రైతులు

MBNR: దేవరకద్ర మండల కేంద్రంలో యూరియా కొరత రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్, ప్రాథమిక సహకార కేంద్రం వద్ద రైతులు గురువారం తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్నారు. ప్రభుత్వం స్పందించి అవసరం మేరకు యూరియా సరఫరా చేయాలని వారు కోరారు. జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత కారణంగా అధికారులు టోకెన్లు ఇచ్చి పంపిణీ చేస్తున్నారు.