తిమ్మాపురం శివారులో కంటైనర్ లారీ బీభత్సం

PLD: యడ్లపాడు మండలం తిమ్మాపురం శివారులో ఆదివారం డ్రైవర్ నిద్రమత్తుతో అదుపు తప్పిన కంటైనర్ లారీ, హైవే డివైడర్‌ను ఢీకొనింది. ఘటనలో భారీ ఇనుప స్తంభం, సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వెంటనే తొలగింపు చర్యలు చేపట్టారు. వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.