రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ
VZM: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం రామతీర్థంలో కొలువైయున్న శ్రీరామ స్వామివారిని, రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్బంగా రాష్ట్ర ప్రజలందరికి ఆ పరమేశ్వరుడు దివ్య ఆశీస్సులు కలిగి ఉండాలని కోరారు. సీఎం చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు.