VIDEO: యాంత్రిక పరికరాలపై విద్యార్థులకు అవగాహన
కొనసీమ: కె.గంగవరం మండలం దంగేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు యాంత్రిక పరికరాల పనితీరుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు యంత్రాల వలన కలిగే ప్రయోజనాలు, వాటి పనితీరును విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుణ్ణం శ్రీనివాస్ పాల్గొన్నారు.