అడవివరం-సత్తరువురోడ్డు పనులపై ఎమ్మెల్యే సూచనలు

అడవివరం-సత్తరువుజంక్షన్ రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్‌తో కలిసి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు పనులు పరిశీలించారు. ఈ మేరకు అధికారులను ప్లానింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనతరం పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వార్డు కార్పొరేటర్ పి.వి.నరసింహ రావు, స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు.