'డయల్ యువర్ కమిషనర్ రద్దు'
TPT: దిత్వా తుఫాను ప్రభావంతో సోమవారం నగరపాలక సంస్థలో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు తిరుపతి కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. అధికారులు, సిబ్బంది తుఫాను సహాయక చర్యల్లో నిమగ్నం అవుతుండటంతో ప్రజలు కార్యాలయానికి రాకూడదన్నారు. అత్యవసర సాయం కోసం 0877-2256766, 9000822909 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.