'టైలర్స్ సొసైటీలకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి'

కోనసీమ: టైలర్స్ సొసైటీలకు, ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని కోరుతూ జిల్లా టైలర్స్ కార్యవర్గం ముమ్మిడివరంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబును శుక్రవారం కలిసి వినతి పత్రం అందజేశారు. టైలర్స్ ఫెడరేషన్ పునరుద్దరించాలని, ప్రైమరీ టైలర్స్ కో-ఆపరేటివ్ సోసైటీలకు ఎన్నికలు నిర్వహించి, టైలర్స్ ఫెడ్‌కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తో కూడిన మేనెజ్ మెంట్ ఏర్పాటు కావాలని కోరారు.