చీలాపల్లి సీఎంసీ ఆసుపత్రి వద్ద ప్రమాదం
చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని క్రిస్టియన్ మెడికల్ కళాశాల సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మేరకు ఆసుపత్రి ముందు ఏర్పాటు చేసిన డివైడర్‌ను లారీ ఢీకొనడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. అదృష్టవశాత్తూ ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.