'స్విచ్ వేయకుండానే లైట్లు, ఫ్యాన్లు పనిచేస్తున్నాయి'

WGL: పర్వతగిరి మండలంలోని ఏబీ తండా శివారు బోటికాడి తండాలో స్విచ్ వేయకుండానే లైట్లు, ఫ్యాన్లు పనిచేస్తున్నాయని తండా వాసులు ఆవేదన చెందుతున్నారు. తండాలోని చాలా ఇళ్లలో ఎర్తింగ్ సమస్యతో స్విచ్‌లు వేయకుండానే విద్యుత్ ఉపకరణాలు పనిచేస్తున్నాయన్నారు. కొందరికి షాట్ సర్క్యూట్ కూడా అయినట్లు గిరిజనులు చెబుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు.