కలెక్టరేట్ పైకి ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం

జనగాం: తన భూమిని ఇతరులకు పట్టా చేశారని సోమవారం జిల్లా కలక్టరేట్ భవనం పైకెక్కి రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. పసరమట్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగరావు అనే రైతు కలెక్టరేట్ బిల్డింగ్ ఎక్కి పురుగు మందు తాగాడు. తాము బతికి ఉన్నప్పటికీ చనిపోయారంటూ తమ భూమిని ఇతరులకు పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.