వృద్ధుడి హత్య.. 4 నెలల తర్వాత అరెస్ట్

వృద్ధుడి హత్య.. 4 నెలల తర్వాత  అరెస్ట్

ASF: తిర్యాణి మండలంలో హత్య చేసి పరారైన నిందితుడిని పోలీసులు 4 నెలల తర్వాత పట్టుకున్నారు. రెబ్బెన పోలీస్ స్టేషన్‌లో ASP చిత్తరంజన్ వివరాలు వెల్లడించారు. తిర్యాణి మండలం మంగికి చెందిన వినోద్ గత నవంబర్‌లో హనుమంత్ రావును హత్య చేశాడు. అరెస్టు అనంతరం వాష్‌రూమ్‌కి వెళ్తానని చెప్పి పరారయ్యాడు. 4 నెలల గాలింపు తర్వాత పోలీసులు అతడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.