'నిబంధనలు ఉల్లంఘించిన బస్సులను సీజ్ చేశాం'
AP: బస్సుల్లో ప్రమాదాల నివారణపై మంత్రుల సమీక్ష ముగిసింది. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు మంత్రి మండిపల్లి తెలిపారు. కర్నూలు, మార్కాపురం, మారేడుమిల్లి ఘటనలకు మానవ తప్పిదమే కారణమని చెప్పారు. రాష్ట్రంలో 16 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీ చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై నిబంధనలు ఉల్లంఘించే వాటిని సీజ్ చేసినట్లు వెల్లడించారు.