కాళేశ్వరంపై రాజకీయ దురుద్దేశంతోనే దుష్ప్రచారం
NLG: బీఆర్‌ఎస్‌ను ప్రజలనుంచి దూరం చేసే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని బూటకపు ప్రచారం చేశారని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.. హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ కుట్రలకు చెక్ పెట్టేలా తీర్పు వచ్చిందన్నారు.