జిల్లాలో పెద్దపులి సంచారం - ఆవుపై దాడి

జిల్లాలో పెద్దపులి సంచారం - ఆవుపై దాడి

ప్రకాశం: అర్ధవీడు మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పులి సంచారం సమీప ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పాపినేనిపల్లి అటవీ ప్రాంత సమీపంలో సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నారాయణపల్లె గ్రామానికి చెందిన ఫణి కుమార్ అనే రైతు మేత కోసం తన అవును సమీపంలోని పాపినేనిపల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లగా పెద్దపులి దాడి చేసింది.