కో ఆప్షన్స్ సభ్యుల ఎన్నికకు దరఖాస్తుల ఆహ్వానం
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గజానంద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండు పదవులు ఒకటి మహిళా సభ్యురాలకు కేటాయించడం జరిగిందని అర్హత గలవారు అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 11వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు మున్సిపల్ కార్యాలయంలో తమ దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు.