రిజర్వాయర్‌కు మంత్రి శంకుస్థాపన

రిజర్వాయర్‌కు మంత్రి శంకుస్థాపన

NRPT: దామరగిద్ద మండలంలోని కానుకుర్తి రిజర్వాయర్‌కు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు ద్వారా కానుకుర్తి గ్రామం చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలుపుతూ, భూ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.