'విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యం'
KRNL: కోసిగిలో విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని టీడీపీ మంత్రాలయం ఇన్‌ఛార్జ్ ఎన్.రాఘ వేంద్ర రెడ్డి తెలిపారు. గ్రామంలోని ఎపీ మోడల్ స్కూల్లో గురువారం పాఠశాల ప్రిన్సిపల్ సుందర్ రావు అధ్యక్షతన వార్షిక దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు రాఘవేంద్రరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు.