అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు: ఎమ్మెల్యే
PDPL: పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు శనివారం కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులైన పేదల సొంతింటి కల నెరవేరుతుందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.