నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NDL: అవుకులో బుధవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. పట్టణంలోని రైస్ మిల్ నుంచి కేబీఎన్ పాఠశాల, కొత్త కాలువ వరకు సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తైనందున విద్యుత్ లైన్లు పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.