నేటి నుంచి పామూరులో అధికారుల పాలన
ప్రకాశం: పామూరు మండలంలో సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో గురువారం నుంచి ప్రతి పంచాయతీకి ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. పంచాయతీలు నడిపించే బాధ్యత ప్రభుత్వ అధికారులపై వేసింది. తహసీల్దార్, ఎంపీడీవో, అగ్రికల్చర్ ఏవో, వెటర్ని డాక్టర్, ఎంఈవో, ఏవోలకు బాధ్యతలను అప్పగించారు.