గడ్డివాములో చెలరేగిన మంటలు
CTR: పుంగనూరు పట్టణం సూర్య నగర్‌లోని ఆవుల కొట్టంలోని గడ్డివాములో సోమవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన స్థానికులు పుంగనూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు విస్తరించకుండా అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు.