నానో యూరియా ఉపయోగాల గురించి అవగాహన

BDK: యూరియా కోసం వచ్చిన రైతులతో నానో యూరియా ఉపయోగాలను జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు తెలిపారు. సోమవారం సుజాతనగర్ మండల సొసైటీ కార్యాలయంలో గోదామును ఆకస్మిక తనిఖీ చేశారు. అలాగే గోదాంలో ఉన్న యూరియా స్టాక్‌ను పరిశీలించారు. వారితోపాటు డీపీడీ సరిత, మండల వ్యవసాయ అధికారి నర్మదా, ఏఈవో అనూష, నరసింహ, సొసైటీ ఇంఛార్జ్ సైదులు పాల్గొన్నారు.