మాజీ మంత్రికి సిట్ నోటీసులు

CTR: లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామికి సిట్ నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల 21వ తేదీన సిట్ కార్యాలయంలో 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నారాయణస్వామికి సిట్ అధికారులు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో జీడి నెల్లూరు నియోజకవర్గం నుంచి ఎన్నికై ఎక్సైజ్ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన పని చేశారు.