క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎంపీ నామినేషన్

KKD: ఈ నెల 16వ తేదీన జరగనున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 2025-2028 ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు ప్రక్రియ మొదలైంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా కాకినాడ నగరానికి చెందిన రాజ్యసభ సభ్యులు, సానా సతీష్ బాబు ఆదివారం మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఛాంబర్‌లో తన నామినేషనన్‌ను దాఖలు చేశారు.