VIDEO: శ్రీవారిని దర్శించుకున్న యూఎస్ఏ క్రికెటర్లు..
TPT: యుఎస్ఏ క్రికెటర్లు మోనాంక్ పటేల్, సౌరభ్ నేత్రావల్కర్, మిలింద్ కుమార్ తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి టీటీడీ అధికారులు రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.