వృద్ధులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు
KMR: పిట్లం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వృద్ధులకు ప్రత్యేకించి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికృష్ణ రావు సూచించారు. శుక్రవారం రోజున CHC పరిధిలోని ప్రత్యేకించి వృద్ధులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆపరేషన్ అవసరమైన వారికి బాన్సువాడ లయన్స్ క్లబ్‌కు సిఫారసు చేశామన్నారు.