లష్కర్‌గూడలో విషాదం.. ప్రాణం తీసిన పల్లి

లష్కర్‌గూడలో విషాదం.. ప్రాణం తీసిన పల్లి

HYD: అబ్దుల్లాపూర్ మెట్ లష్కర్‌గూడలో విషాదం నెలకొంది. 4 ఏళ్ల చిన్నారిని పల్లీలు బలికొన్నాయి. పల్లీలు తింటుండగా గొంతులో ఇరుక్కుని చిన్నారి తన్వికా తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే చిన్నారిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ  సోమవారం మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.