మెగా ప్లాంటేషన్ ఏరియల్ వ్యూ

సిద్దిపేట: జిల్లా వ్యాప్తంగా మంగళవారం చేపట్టిన మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొని తమ తల్లి పేరు మీద మొక్కలు నాటారు. దాదాపు 15 వేల మొక్కలు నాటినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, అన్ని శాఖల అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటారు. భవిష్యత్తు తరాల కోసం మొక్కలు పెంచాలన్నారు.