కొండా సురేఖపై కేసు.. నాగార్జున కీలక నిర్ణయం
TG: టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి కొండా సురేఖపై పెట్టిన పరువు నష్టం దావా కేసును ఆయన విత్‌డ్రా చేసుకున్నారు. అయితే సురేఖ ఇటీవల బహిరంగ క్షమాపణ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆ కేసును నాగార్జున ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. కాగా నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.