VIDEO: 'వాయిల సింగారం మార్గంలో డబుల్ రోడ్డు నిర్మించాలి'
SRPT: కోదాడ నుంచి వాయిల సింగారం వరకు ఉన్న రహదారి అత్యంత ఇరుకుగా ఉండటంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. నిత్యం వందలాది వాహనాలు, స్కూల్ బస్సులు తిరిగే ఈ మార్గంలో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు దారి దొరక్క ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అధికారులు తక్షణమే స్పందించి డబుల్ రోడ్డు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.