స్కూల్ గేమ్స్ జిల్లా జట్ల ఎంపిక వాయిదా

స్కూల్ గేమ్స్ జిల్లా జట్ల ఎంపిక వాయిదా

PLD: సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించాల్సిన ఫుట్ బాల్ అండర్-14 బాలుర బాలికల ఉమ్మడి గుంటూరు జిల్లా జట్ల ఎంపిక వాయిదా వేసినట్లు స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్ బుధవారం తెలిపారు. నందిగామ పాఠశాల ఆట స్థలంలో వర్షాలకు నీరు నిల్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో నూతన తేదీని ప్రకటిస్తామన్నారు.